NTV Telugu Site icon

Devi Sri Prasad: ఆ హీరోయిన్ తో దేవి శ్రీ ప్రసాద్ ఎఫైర్.. సీక్రెట్ గా పెళ్లి..?

Dsp

Dsp

Devi Sri Prasad: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దివి శ్రీ ప్రసాద్ పేరు కూడా ఉంటుంది. టాలీవుడ్ లో హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దేవి ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించే పనిలో ఉన్నాడు. ఇక మరోపక్క మ్యూజిక్ కన్సర్ట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ వయస్సు 45. ఎప్పటినుంచో దేవి శ్రీ పెళ్లి చేసుకొంటే చూడాలని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక గత కొంత కాలంగా హీరోయిన్ పూజితా పొన్నాడతో దేవి శ్రీ రిలేషన్ లో ఉన్నాడని, సీక్రెట్ గా మ్యారేజ్ కూడా జరిగిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ వార్తలపై మ్యూజిక్ డైరెక్టర్ స్పందించింది లేదు. తాజాగా హీరోయిన్ పూజిత స్పందించింది. ఇలాంటి పుకార్లను అభిమానులు నమ్మవద్దని తెలిపింది.

ప్రస్తుతం ఆమె ఆకాశ వీధుల్లో అనే చిత్రంలో నటించారు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకొని ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత మాట్లాడుతూ “గత కొంతకాలంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో నేను రిలేషన్ లో ఉన్నానని వస్తున్న వార్తలు అన్ని అబద్దాలు. ఇలాంటివి ఎవరు పుట్టిస్తున్నారో తెలియడం లేదు. కొంతమంది అయితే ఆయనతో రహస్యంగా పెళ్లి కూడా అయ్యిందని చెప్పుకొస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ నాకు తెలుసు, పరిచయం ఉంది. అంతే.. మేము ఎప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకొన్నది కూడా లేదు. ఆయనతోనే కాదు ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్ లో లేను.. సింగిల్ గానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.