డీజే టిల్లు సినిమాలో ‘రాధిక’ క్యారెక్టర్ లో నటించిన యూత్ కి విపరీతంగా దగ్గరైంది హీరోయిన్ ‘నేహా శెట్టి’. మెహబూబా సినిమాలో అఫ్రీన్ గా నటించి తెలుగు తెరకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ, డీజే టిల్లు సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి గ్లామర్ కుర్రాళ్లకి కిక్ ఇచ్చింది. మంచి పర్ఫార్మర్ కూడా అయిన నేహా శెట్టి, ఇటీవలే బెదురులంక సినిమాతో కూడా హిట్ కొట్టింది. డీజే టిల్లు సినిమాలో మోడరన్ లుక్ లో కనిపించిన నేహా శెట్టి, బెదురులంక సినిమాలో ట్రెడిషనల్ డ్రెస్సులు ఎక్కువగా వేసుకోని కనిపించింది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన నేహా శెట్టి ప్రస్తుతం విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ సినిమాలు చేస్తుంది.
రిలీజ్ కి రెడీగా ఉన్న రూల్స్ రంజన్ సినిమా నుంచి ‘సమ్మోహనుడా’ సాంగ్ ఇప్పటికే ట్రెండ్ అవుతూ ఉంది. ఈ సాంగ్ లో తన డాన్స్ అండ్ గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన నేహా శెట్టి, లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో నేహా శెట్టి నడుము అందాలని చూపిస్తూ ఫిదా చేస్తుంది. పర్పుల్ కలర్ బ్లౌజ్, వైట్ కలర్ సారీ, నడుముకి బెల్లీ చైన్ తో నేహా శెట్టి కుర్రాళ్లకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. అందుకే డీజే టిల్లు సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ “మనసుని ముక్కలు చేసే మెషిన్ వి రాధికా నువ్వు” అనేశాడు. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్, నేహా శెట్టి అందాలని ఏ రేంజులో పొగుడుతాడో చూడాలి.
Life Lately : Chapter 4 pic.twitter.com/tSJ06Rj7Yb
— Neha Sshetty (@iamnehashetty) September 13, 2023
