NTV Telugu Site icon

Kriti Sanon: అతను నాతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడు.. సీత షాకింగ్ కామెంట్స్

Kriti

Kriti

Kriti Sanon: కృతి సనన్.. ప్రస్తుతం ఈ పేరు చెప్పగానే సీత అని అనేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి.. సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే. జూన్ 16 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడటంతో వరుస ప్రమోషన్స్ లో బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంది. సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ కెరీర్ మొత్తంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో చాలామంది తమకు సక్సెస్ వచ్చినా తరువాతే చెప్పుకొస్తారు. ప్రస్తుతం కృతి సనన్ సైతం అలాగే చెప్పుకొచ్చింది. తాను కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసే సమయంలో ఒక కొరియోగ్రాఫర్ తనను అవమానించాడని చెప్పుకొచ్చింది.

Animal: వైలెంట్ అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇదేందయ్యా ఇది..

” నేను మోడలింగ్ ద్వారా నా కెరీర్ మొదలుపెట్టాను. ఆ సమయంలో నాకు ఏమి తెలిసేది కాదు. ఒక ర్యాంప్ షోలో ఒక కొరియోగ్రాఫర్ నాతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. నన్ను అవమానించాడు. నాకు ఎంతో బాధ అనిపినించింది. ఈ కెరీర్ ను వదిలేద్దాం అనుకున్నాను. వెంటనే అమ్మకు ఫోన్ చేసి.. ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాను. దానికి అమ్మ.. ప్రతిచోటా సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుంది అని చెప్పింది. ఆ మాట ఇప్పటికి గుర్తుపెట్టుకుంటాను. అమ్మ చెప్పిన మాటల వలనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments