Site icon NTV Telugu

Ileana: ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన గోవా బ్యూటీ…

Ileana

Ileana

ఉస్తాద్ రామ్ పోతినేనితో నటించిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ‘ఇలియానా డీక్రూజ్’. మహేశ్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది ఇలియానా. నాజూకు నడుముతో, తన అవర్ గ్లాస్ షేప్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన ఇలియానా తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు, కోటి రూపాయల రెమ్యునరేషన్ ని కూడా వదిలేసి హిందీలోకి ఎంటర్ అయ్యింది. అక్కడ సినిమాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయి కెరీర్ బూస్ట్ మాత్రం రాలేదు. దీంతో ఇలియానా హిందీతో పాటు తెలుగుకి కూడా దూరం అయ్యింది. అలా సినిమాలకి దూరమైనా ఇలియానా, తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చే ఇలియానా, ఈసారి మత్రమ తన లేటెస్ట్ ఫోటోతో షాక్ ఇచ్చింది.

ఇలియానా తను ప్రెగ్నెంట్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. “Coming soon. Can’t wait to meet you my little darling” అని కోట్ చేసి ఇలియానా ఒక చిన్నపిల్లలు వేసుకునే టీషర్ట్ ని, ‘మామ’ అని ఉన్న లాకెట్ ని పోస్ట్ చేసింది. ఇలియానా పోస్ట్ చేసిన టీషర్ట్ పైన ‘And so the adventure begins’ అనే క్యాప్షన్ ఉంది. ఇలియానా పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలియానా పోస్ట్ కింద, వాళ్ల అమ్మ సమీరా డి’క్రూజ్… “Welcome soon to the world my new grand baby (heart emoticon) can’t wait” అని కామెంట్ చేసింది. సమీరా నుంచి రిప్లై రాగానే ఇలియానా పెట్టిన పోస్ట్ ప్రాంక్ కాదు అనే విషయం అర్ధమవుతుంది. ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ కి ఫాన్స్ కంగ్రాట్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు, వెల్ విషర్స్ ఇలియానాకి అభినందనలు తెలుపుతున్నారు.

ప్రెగ్నెన్సీ న్యూస్ అయితే చెప్పింది కానీ తన బేబీకి తండ్రి ఎవరు అనేది ఇలియానా రివీల్ చెయ్యలేదు. గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది కానీ వారు 2019లో విడిపోయారు. రీసెంట్ గా ఇలియానా, హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ని నిజం చేస్తూ గత ఏడాది మాల్దీవ్స్ లో జరిగిన కత్రినా పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో ఇలియానా, సెబాస్టియన్ తో కలిసి కనిపించింది. ఈ ఇద్దరి పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. పెళ్లి వార్త చెప్పకుండానే ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పడంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు.

Exit mobile version