Hero Vishal Spotted with a Unknown girl at New York City Roads: అవ్వడానికి తెలుగు వాడే అయినా విశాల్ తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాదు అక్కడ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తూ తమిళ సినీ రంగంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే విశాల్ ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు తమిళ మీడియా వర్గాల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. తమిళ క్రిటిక్ రమేష్ బాల తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియోలో విశాల్ లాంటి ముఖ కవళికలు ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయితో కలిసి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు, అయితే తమను కెమెరాతో రికార్డ్ చేస్తున్నారని విషయం అర్థమైన వెంటనే సదరు వ్యక్తి ముఖాన్ని దాచేసుకుని పరిగెట్టడం కనిపిస్తోంది. న్యూయార్క్ లో నడుస్తున్న ఈ వ్యక్తి విశాల్ ఏనా అంటూ రమేష్ బాలా తన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వీడియో పెట్టారు కానీ చూసిన అందరూ కూడా అతని విశాల్ లాగానే ఉన్నాడని అయితే ఇదేదో సినిమా ప్రమోషన్ లాగా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కింది వీడియో చూసి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
Kalyan Ram: నవీన్ మేడారం గురించి నన్నడగొద్దు.. కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో అనీషా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలని విశాల్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంటున్నట్లుగా అనీషా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఆమె మరో వివాహం కూడా చేసుకున్నారు. కానీ విశాల్ పెళ్లి గురించి ఎన్ని సార్లు ప్రస్తావన వచ్చినా నడిగర్ సంఘానికి ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ లోనే తన వివాహం చేసుకోబోతున్నానని అనేకసార్లు చెబుతూ వచ్చేవాడు . అయితే నిజానికి ఈ వీడియోలో ఉన్నది విశాల్ ఏనా? విశాల్ అయితే ఎందుకు ముఖం దాచుకుంటూ పరుగులు పెడుతున్నారు? అనేది చర్చనీయాంశం అయింది.
Is that Actor @VishalKOfficial walking with someone in NYC 🤔 pic.twitter.com/ddMESEuKOq
— Ramesh Bala (@rameshlaus) December 26, 2023