Hero Vishal Sensational Comments on Chandrababu Arrest: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వాదనలు కొనసాగుతున్న క్రమంలో చంద్రబాబుకు సినీ రంగం నుంచి మద్దతు పెరుగుతోంది. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై ప్రముఖ సినీ హీరో విశాల్ స్పందించారు. తాజాగా విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ చంద్రబాబు గొప్ప నాయకుడు అని పేర్కొన్న ఆయన అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్యుడి పరిస్థితి ఏమిటి అని తనకు భయం కలుగుతోంది అని అన్నారు.
Telugu Hero Raja: బ్రేకింగ్: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ హీరో
చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తనకే భయం వేస్తోందని పేర్కొన్న విశాల్ ఆయన అంటే తనకు అభిమానం అని చెప్పడం లేదు కానీ అరెస్ట్ చేసే ముందు కొంచెం అలోచించి ఉంటే బాగుండేది అని అన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వల్ల పూర్తిగా కేసు మీద అవగాహన లేదు కానీ చివరికి న్యాయం గెలుస్తుందని, ఆ న్యాయం కోసం తన లాంటి సామాన్యులం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇక ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించి, చంద్రబాబు గొప్ప పోరాటయోధుడని ఆయన అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవాలనుకున్నా ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని చెప్పారు. అయితే గతంలో విశాల్ చంద్రబాబుకు పోటీగా కుప్పంలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అలాంటి హీరో విశాల్ ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.