అక్కినేని హీరోగా ప్రేమకథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఈ సినిమా తరవాత విభిన్నమైన కథలను ఎంచుకొని మంచి హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరోగా మాత్రం నిలవలేకపోయాడు. అలా అని హీరోగా కాకుండా వేరే ఏ పాత్రలలోను కనిపించలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా టాలీవుడ్ పై దండెత్తి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’ చిత్రం డైరెక్ట్ ఓటిటీ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. జీ5 లో ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచిన సుమంత్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా సుమంత్ ఒక ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
సీఎం జగన్, సుమంత్ క్లాస్ మేట్స్ అన్న విషయం తెలిసిందే.. ” నాకు జగన్ చిన్నతనం నుంచి తెలుసు.. చిన్నప్పుడే అతను ఒక గొప్ప పొజిషన్ కి వెళ్తాడని నేను అప్పుడే అనుకున్నాను . నా ప్రపంచం చాలా చిన్నది.. నేనేంటో నాలోకం అంతా వేరుగా ఉంటుంది. రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోను. కనీసం పేపర్ చదివే అలవాటు కూడా లేదు. ఇక పవన్ కళ్యాణ్ కి, జగన్ కి మధ్య ఏం జరుగుతుందో నాకేం తెలుసు. పవన్ కళ్యాణ్ ని నేను విడిగా కలిసాను. కానీ మేము సినిమాల గురించే మాట్లాడుకున్నాం. నాకు తెలియని రాజకీయాల గురించి నేను కామెంట్ చేయడం పద్దతి కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుమంత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సుమంత్ హిట్ ని అందుకుంటాడా ..? లేదా అనేది చూడాలి.