NTV Telugu Site icon

Suman: స్టార్ హీరోకి కోడలిగా సుమన్ కూతురు..?

Suman

Suman

Suman: టాలీవుడ్ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఒకప్పుడు అదరగొట్టిన సుమన్ ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇక సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ఈ మధ్యనే సుమన్.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ మాట్లాడిన స్పీచ్ కు సపోర్ట్ గా నిలిచాడు. ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులేదు అని తెలిపాడు. అంతేకాకుండా చంద్రబాబు వలనే హైదరాబాద్ ఇలా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఆయన జైలుకు వెళ్లిన విధానం, అప్పుడు తనకు ఎవరు సపోర్ట్ గా నిలిచారు.. ఎన్ని ఇబ్బందులు పడ్డారు అని ఏకరువు పెట్టాడు.

Naga Chaitanya: కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..?

చిరంజీవి వలనే సుమన్ .. జైలుకు వెళ్లాడని చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం ఎలాంటి చిరు, సుమన్ ఇద్దరు చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. తాను చేయని తప్పుకు జైలుకు వెళ్లినట్లు తెలిపిన సుమన్.. దివాకర్ అనే ఫ్రెండ్ చేసిన తప్పు వల జైలుకు వెళ్లినట్లు తెలిపాడు. దివాకర్ దగ్గర ఒక కారు ఉండేదట.. ఆ కారును అతను బ్లూ ఫిల్మ్స్ లో వాడేవాడట. అది తెలియని సుమన్ .. ఒకరోజు ఆ కారు వేసుకొని వెళ్తుండగా.. ఆ బ్లూ ఫిల్మ్స్ తీయడంలో సుమన్ హస్తం కూడా ఉందని ఆయనను జైల్లో పెట్టారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత తనకు సపోర్ట్ గా నిలిచారని సుమన్ చెప్పుకొచ్చాడు. ఇక తన కుటుంబం గురించి కొన్నిరోజులుగా ఒక వార్త వినిపిస్తోందని, తన కూతురును ఒక స్టార్ హీరో కొడుకుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అందులో నిజం లేదు. ప్రస్తుతం నా కూతురు చదువుకుంటుంది.. ఇప్పుడప్పుడే తనకు పెళ్లి చేయాలి అనుకోవడం లేదు. ఇలాంటి వార్తలు రాయడం ఆపండి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అసలు ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం సుమన్ చెప్పలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments