NTV Telugu Site icon

Sri Vishnu: క్రేజీ టైటిల్ తో మరో థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న హీరో శ్రీవిష్ణు..

Untitled Design (16)

Untitled Design (16)

టాలీవుడ్ యంగ్ హీరోలో శ్రీవిష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.తన ప్రతి ఒక సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. చివరగా గత ఏడాది ‘స్వాగ్’ ,‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో వచ్చాడు. ఈ రెండు చిత్రాలు మంచి కామెడి బేస్ తో విడుదలైనప్పటి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. కానీ శ్రీ విష్ణు నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అందుకే ఈ ఏడాది కూడా శ్రీవిష్ణు కొత్త తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు.

తాజాగా శ్రీవిష్ణు తన కొత్త ప్రాజెక్ట్‌ ‘మృత్యుంజయ’తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా పేరు పొందిన హుస్సేన్, గతంలో ‘పుష్ప’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పని చేశారు. ఇక ఇప్పుడు ‘మృత్యుంజయ’ తో రాబోతున్నాడు.

థ్రిల్లర్‌ స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమా కథలో మిస్టరీ, సస్పెన్స్ ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌తో పాటు కథ గురించి మరిన్ని అప్‌డేట్స్ టీమ్ తెలపనుంది. శ్రీ విష్ణు ప్రతి చిత్రంలో కూడా కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుండటంతో, ఈ సినిమా కూడా ప్రత్యేకంత ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.