Hero Srikanth family at brother daughter wedding : ఈ మధ్య కాలంలో హీరో శ్రీకాంత్ ఆయన భార్య ఊహ విడిపోతున్నారంటూ కథనాలు వెలువడిన క్రమంలో అవన్నీ నిజం కాదని ముందు బండ్ల గణేష్ ప్రకటించారు. ఇక ఈ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన శ్రీకాంత్ ఈ పుకార్లను ఖండించారు. ఇక ముందుగా ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారి బిజీ అవుతున్నారు. ముందు నుంచే కొన్ని సినిమాలు విలన్ గా చేసినా ఈ మధ్య చేసిన అఖండ అలాగే విజయ్ హీరోగా చేసిన వారసుడు సినిమాలో కూడా ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతానికి శ్రీకాంత్ ఖాతాలో గేమ్ ఛేంజర్, దేవర లాంటి బడా ప్రాజెక్టులతో పాటు అనేక చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే శ్రీకాంత్ కి స్వయానా తమ్ముడు అయిన అనిల్ మేక కూతురు వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Akkineni Nagarjuna: ఆ స్టార్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్.. మరో ఊపిరి అయితే కాదుగా.. ?
స్వయంగా తమ్ముడి కుమార్తె వివాహం కావడంతో శ్రీకాంత్ కుటుంబంతో పాటు ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ఇక పెళ్లి కూతురిని కుటుంబ సమేతంగా ఆశీర్వదించారు. శ్రీకాంత్ భార్య ఊహ, కొడుకు రోషన్, కూతురు మేధ, చిన్న కుమారుడు రోహన్ ఈ పెళ్ళిలో సందడి చేయగా శ్రీకాంత్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి 1999లో ‘ప్రేమించేది ఎందుకమ్మా’ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఒకటి చేశారు. అయితే ఎందుకో కానీ ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆయన హీరోగా ప్రయత్నాలు ఆపేశారు. నిర్మాతగా ఒకటి రెండు చిత్రాలు చేసి అవి కూడా కలిసి రాకపోవడంతో సినీ పరిశ్రమకి దూరమయ్యారు. ఇక మరో పక్క వృషభ టైటిల్ తో మోహన్ లాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ప్రకటించగా ఆ సినిమాలో శ్రీకాంత్ తో పాటు కొడుకు రోషన్ కూడా నటిస్తున్నారు. వృషభ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది.