NTV Telugu Site icon

Siddharth: ‘హైదరీ’ ప్రేమకోసం.. ఏదైనా చేస్తా!

Siddharth

Hero Siddharth Comments on Aditi rao Hydari: చిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధార్థ సిద్దమయ్యాడు. ఈ నెల ఆరవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో బయ్యర్లు కరువయ్యారంటూ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ పేర్కొనడమే కాక ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎన్టీవీ ఆయనతో ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా విశేషాలతో పాటు కొన్ని పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ అదితి రావు హైదరితో కలిసి చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ ఒకటి వైరల్ అవుతుంది, ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తే తనను ప్రేమించే వారు అడిగినప్పుడు రీల్స్ చేస్తానని అయితే తనకు మామూలుగా అయితే చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

Pushpa: పుష్ప గాడిని మరువని డేవిడ్ వార్నర్.. మ్యాచ్ మధ్యలో తగ్గేదేలే అంటున్నాడు!

సాధారణంగానే తనకు డాన్స్ రాదు, కాబట్టి సినిమా అయినా రియల్ అయినా చాలా ప్రాక్టీస్ చేసి వారికి ఇబ్బంది పెట్టకుండా తనకు డాన్స్ రాదనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియకుండా ఉండేందుకు మేనేజ్ చేస్తారని చెప్పకువచ్చాడు. ఇక అదితీరావు హైదరీ గురించి మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా సున్నితంగా ప్రస్తుతం సినిమా గురించి మాత్రమే అని అంటూ ఆయన సంభాషణ అక్కడితో కట్ చేశాడు. అతిథి రావు హైదరికి డాన్స్ బాగా వస్తుంది, మీకేమో డాన్స్ రాదని చెబుతున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారని అడిగిన దానికి ఆయన సమాధానం గా ఈ మేరకు కామెంట్ చేశారు. ఈ సినిమాలో చిన్న పిల్లతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది, కానీ వాళ్ల పర్ఫామెన్స్ తో మ్యాచ్ చేసేలా నటించడం కూడా కష్టమనిపించింది అని చెప్పుకొచ్చాడు.

Show comments