NTV Telugu Site icon

Sharwanand: శర్వానంద్‌ కారు ప్రమాదం… అదుపు తప్పి బోల్తా

Sharwanand

Sharwanand

యంగ్ హీరో శర్వానంద్ జూన్ 3న రాజ‌స్థాన్‌లో రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 26నే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో శర్వానంద్ కి యాక్సిడెంట్ అనే మాట అందరినీ కంగారు పెడుతోంది. శనివారం అర్ధరాత్రి శర్వానంద్ ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు మైనర్ ఇంజ్యురీస్ అయ్యాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రోడ్ నెంబర్ 45 నుంచి ఆదివారం ఉద‌యం మూడు గంట‌ల ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న సమయంలో శ‌ర్వానంద్ త‌న డ్రైవ‌ర్‌తో క‌లిసి ప్ర‌యాణిస్తోన్న రేంజ్ రోవ‌ర్ కారు ఫిల్మ్ న‌గ‌ర్ జంక్ష‌న్ దగ్గ‌ర‌… ఎక్కువ స్పీడు ఉన్న తరుణంలో ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో ఫుట్పాత్ ను ఢీకొన్న అదుపు త‌ప్పి బోల్తా కొట్టింది.

సంఘటన స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి,
డ్రైవర్ కు బ్రీతింగ్ ఎనలైజ్ టెస్ట్ చేసి, మద్యం సేవించలేదని నిర్దారించుకున్న తర్వాత వదిలిపెట్టారు. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతినింది. డ్రైవ‌ర్ ప‌క్క‌నే కూర్చున్న శ‌ర్వానంద్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడని, వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు, శర్వానంద్ బాగున్నాడని సమాచారం. ఈ విషయంలో శర్వానంద్ టీమ్ స్పందించింది… “హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు” అని చెప్పారు. అసలు కార్ ప్రమాదం అందుకు జరిగింది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also: Shruti Haasan: బ్లాక్ ఫ్లవర్ తో మతి పోగొడుతున్న శృతి