Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ ఒకడు. ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకొంటున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో అభిమానులను మెప్పించిన శర్వా ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారాడు. ఇక ఇటీవలే నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో సందడి చేసిన ఈ కుర్ర హీరో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు శర్వానంద్.. అడివి శేష్, ప్రభాస్ తరువాత అని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో కుర్ర హీరో పెళ్ళికి ఇంకా టైమ్ ఉందిలే అనుకున్నారు. అయితే శర్వా మాత్రం ఈ ఏడాది పెళ్ళికి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
శర్వా కొన్నేళ్ల నుంచి ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయిగా సమాచారం అందుతోంది. ఇరు కుటుంబ వర్గాలు వీరి పెళ్లికి ఓకే అనడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు శర్వాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రభాస్ తరువాత పెళ్లి చేసుకుంటాను అని ప్రభాస్ కన్నా ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నావా ..? భయ్యా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి శర్వా.. తనకు కాబోయే భార్యను అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాలి.
