బేవర్స్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హీరో సంజోష్. రమేష్ చెప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించగా.. సంజోష్ సరసన హర్షిత పన్వర్ నటించింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా రాజేంద్ర ప్రసాద్, సంజోష్ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమా సంజోష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తరువాత సంజోష్ రెండవ సినిమాను ప్రకటించాడు. కాన్ ఎంటర్ టైనెమెంట్ బ్యానర్ లో సంజోష్ ఒక కొత్త సినిమాను చేస్తున్నాడు.
నేడు తమ హీరో బర్త్ డే సందర్భంగా మేకర్స్ సంజోష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ తమ్ సినిమాను కన్ఫర్మ్ చేశారు. ప్రొడక్షన్ నెం 2 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. మరి ఈ సినిమాతో ఈ యంగ్ హీరో మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
