మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డుప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. అంతటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం అంటే తేజు మళ్లీ పుట్టినట్లే.. ఆ ప్రమాదం నుంచి నెలా 15 రోజులు బెడ్ కే పరిమితమైన తేజు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుకున్నారు. అందరి దేవుళ్లు కరుణించి ఈ మెగా మేనల్లుడు స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ సెట్స్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ ” తిరోగమనం కంటే పునరాగమనం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది” అనే కొటేషన్ ను జత చేశాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత తేజు లుక్ మారిపోయింది.. వాయిస్ రావడంలేదు అని వార్తలు గుప్పుమంటున్న వేళ.. మునుపటి రూపంలో ప్రత్యేక్షమయ్యాడు సుప్రీం హీరో. తాజా ఫోటోలో తేజూ లుక్ అదిరిపోయింది.
గుబురైన గడ్డం.. బ్లూ కలర్ సూట్… చురుకైన చూపుతో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యం ఆ చూపులోని కాన్ఫిడెంట్ తేజ్ ఎంత స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నాడో అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రమాదం ముందు తేజ్ నటించిన రిపబ్లిక్ విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్, కార్తీక్ వర్మ దన్ను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రమాదం ముందు నుంచే ఈ షూటింగ్ మొదలుకాగా.. యాక్సిడెంట్ వలన వాయిదా పడిన ఈ షూటింగ్ లో తేజు పాల్గొననున్నాడు. ఇది కాకుండా మరో కొత్త సినిమాలోను సుప్రీం హీరో నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదిఏమైనా చావు అంచుల నుంచి బయటపడ్డ ఈ మృత్యుంజయుడు.. ముందు ముందు మంచి సినిమాలు చేయాలనీ కోరుకొంటున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
