NTV Telugu Site icon

Raviteja: మాస్ మహారాజా వారసుడు టాలీవుడ్ ఎంట్రీ.. షురూ

Raviteja

Raviteja

Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో.. హీరో, స్టార్ హీరో, మాస్ మహారాజా వరకు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి లాంటి సెల్ఫ్ మేడ్ స్టార్ వృక్షాన్ని పట్టుకొని ఆయన కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చారు. సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రవితేజ ఇంటి నుంచి కూడా ఒక వారసుడు రాబోతున్నాడు. వారసుడు అంటే రవితేజ సొంత కొడుకు కాదు లెండి. ఆయన సోదరుడు రఘు రాజు కుమారుడు. రఘు కూడా కొన్ని సినిమాల్లో కనిపించాడు. అతని కొడుకు మాధవ్ టాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది.

Samantha: బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో

పెళ్లి సందడి సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన గౌరీ రోణంకి దర్శకత్వంలో మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు ఈ పూజా కార్యక్రమానికి గెస్టులుగా విచ్చేశారు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక పూజకు రాలేకపోయిన రవితేజ ట్విట్టర్ వేదికగా మాధవ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. “మా అబ్బాయి మాధవ్ అతని తొలి సినిమాకు నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మీరందరూ అతనిని మీ ప్రేమతో ఆశీర్వదించండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ వారసుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.