Hero Nithiin Blessed with Baby Boy: హీరో నితిన్ ఇంట ఆనంద సంబరాలు మొదలయ్యాయి. ఎందుకంటే నితిన్ ఇంటికి వారసుడు వచ్చేసాడు. హీరో నితిన్ షాలిని అనే యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంత కాలం క్రితం షాలిని గర్భం దాల్చారు. ఇక ఎట్టకేలకు ఈరోజు జూనియర్ నితిన్ జన్మించినట్లుగా నితిన్ పిఆర్ టీం వెల్లడించింది.
Lavanya : ఆమెతో అఫైర్ పెట్టుకుని రాజ్ తరుణ్ క్రిమినల్ లా తయారయ్యాడు!
ఈ మేరకు ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. యాక్టర్ నితిన్ ఆయన భార్య షాలిని ఒక పండంటి మగ బిడ్డకు తల్లి తండ్రులు అయ్యారని, ప్రస్తుతానికి తల్లితో పాటు బిడ్డ కూడా హెల్తీగా ఉన్నారని అంతా సవ్యంగా నడుస్తోందని ప్రకటించారు. నితిన్ ప్రస్తుతానికి వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన తమ్ముడు సినిమా చేయాల్సి ఉంది.