NTV Telugu Site icon

Nithin: యంగ్ హీరో చేతికి ‘కబ్జా’, మరో ‘విక్రమ్’ అవుతుందా?

Nithiin

Nithiin

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF స్థాయిలో వస్తున్న మరో సినిమా ‘కబ్జా’. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లాంటి స్టార్ హీరోస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్చ్ 17న ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న కబ్జా మూవీకి రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవనుంది. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న కబ్జా మూవీని చంద్రు, అలంకార్ పాండియన్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీపై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని కాష్ చేసుకోవడానికి యంగ్ హీరో నితిన్ రెడీ అయ్యాడు. నితిన్ కి చెందిన ‘రుచిరా ఎంటర్టైన్మెంట్స్’, ‘ఎన్ సినిమాస్’ సంయుక్తంగా కబ్జా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ నితిన్ అఫీషియల్ గా ట్వీట్ చేశాడు.

Read Also: Kabzaa: మార్చ్ 17న కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా

హీరోగా గత కొంతకాలంగా ఆశించిన స్థాయి హిట్స్ అందుకోలేక పోతున్న నితిన్, ఇటివలే కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమల్ హాసన్ కే కాదు నితిన్ బ్యానర్ కూడా చాలా హెల్ప్ అయ్యింది. మంచి ప్రైస్ కి విక్రమ్ రైట్స్ కొన్న నితిన్, తెలుగులో సాలిడ్ ప్రమోషన్స్ ని చేసి మంచి డబ్బులు వెనకేసుకున్నాడు. ఇప్పుడు మరో లార్జర్ దెన్ లైఫ్ సినిమా అయినా కబ్జా మూవీని కూడా నితిన్ అదే రేంజులో ప్రమోట్ చేస్తే అతని డిస్ట్రిబ్యుషన్ లో మరో విక్రమ్ రేంజ్ హిట్ తెలుగులో వచ్చే ఛాన్స్ ఉంది. ఉపేంద్ర మూవీకి, కిచ్చా సుదీప్ కి తెలుగులో మంచి గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా బాగానే ఉంది. సో అది నితిన్ ని ఇంకాస్త కలిసొచ్చే విషయం.