సమాజంలో రోజు రోజుకి నేరాలు పెరిగి పోతున్నాయి. మరి ముఖ్యంగా రేపటి భవిష్యత్తును కాపాడాల్సిన యువత మత్తులో మునిగి తేలుతున్నారు. సిగరెట్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. వీటిని అరికట్టి యువతను సక్రమైన మార్గాల్లో నడిపేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జలవిహార్ వద్ద ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు.
Also Read : Shocking : ఆ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ కొనేవారు కరువు?
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేసాడు. అనంతరం సమాజం పట్ల తన వంతు బాధ్యతగా నిఖిల్ యువతకు ఓ చక్కటి సందేశాన్ని అందించారు. నిఖిల్ మాట్లాడుతూ ‘సిగిరెట్ కదా అని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఆల్కహాల్ తీసుకునే అవుతుంది ఆ తర్వాత ఇంకా పెద్ద మత్తు పదార్థం సేకరించేంత వరకు వెళ్తుంది. చదువుకునే సమయంలోనే సిగరెట్ కి నో చెప్పాను. హుక్కా తాగాలని అడిగినా కూడా నేను నో చెప్పాను.అది మన శరీరాన్ని ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది మన భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేస్తుంది. మన భవిష్యత్తు అంధకారంగా మారడానికి మాదకద్రవ్యాలే ప్రధాన కారణం. మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మత్తు పదార్దాలు తీసుకున్నారని తెలిస్తే 1908 కి వెంటనే కాల్ చేసి చెప్పాలి. సినిమాలో హీరో కావాలన్నా, హీరోయిన్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలనుకున్నా ఇంకా ఏ మంచి పొజీషన్ కు వెళ్ళాలన్నా సరే సే నో టూ డ్రగ్స్. డ్రగ్స్ దూరంగా ఉండండి మీరు కలలు కన్న భవిష్యత్తును మీకు నచ్చిన విధంగా నిర్మిచుకోండి’ అని అన్నారు.
