NTV Telugu Site icon

Sagileti Katha: నవదీప్ సమర్పణలో ‘సగిలేటి కథ’.. ఆరోజే ట్రైలర్ రిలీజ్

Sagileti Kadha Trailer

Sagileti Kadha Trailer

Sagileti Katha Trailer Update: యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్న రవితేజ మహా దాస్యం హీరోగా విషిక కోట హీరోయిన్ గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో ‘సగిలేటి కథ’ మూవీ రూపొందింది. అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీది అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించగా అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ ఈ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీని సమర్పిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను అందరినీ అలరించేలా రూపొందించినట్టు మేకర్స్ చెబుతున్నారు, ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో చికెన్ కూడా ఒక పాత్ర పోషిస్తోంది. “చికెన్ అంటే కూరో, వేపుడో కాదు…చికెన్ అంటే ఒక ఎమోషన్ అంటున్నారు మేకర్స్. ఇక ఈ ‘సగిలేటి కథ’ ద్వారా రాయలసీమ నేటివిటీ, కల్చర్ అండ్ ట్రెడిషన్ ని అందరికీ పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Genelia D’Souza : కొన్ని ఓటీటీ కంటెంట్ సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నాము..

సగిలేటి కథ కేవలం సినిమా కాదు, మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాల సమర్పణ అని ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుందని అంటున్నారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని, ఈ సినిమాలో హీరోగా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నానని రవితేజ మహా దాస్యం చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా చూసి నచ్చడంతో హీరో నవదీప్ ప్రేక్షకుల ముందుకు తన సమర్పణలో తీసుకురాబోతున్నారు. ఇక త్వరలో ఈ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేసిన క్రమంలో 31 వ తారీకు ట్రైలర్ ని విడుదల చేయబోతున్న్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు రచయితగా దర్శకుడిగా వ్యవహరించిన రాజశేఖర్ సుద్మూన్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాధ్యతలు కూడా చూసుకున్నారు.. ఇక ఈ సినిమాకి జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించారు.

Show comments