Nani : ప్రస్తుతం టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూల మీద పెద్ద రచ్చ జరుగుతోంది. మూవీ రిలీజ్ అయిన రోజే రివ్యూలు రాయడం, వీడియోలను బ్యాన్ చేయాలంటూ టాలీవుడ్ పెద్దలు చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రివ్యూల విషయంపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నేను కూడా ఈ విషయం గురించి వింటున్నాను. కానీ రివ్యూలను బ్యాన్ చేయడం అసలు సాధ్యపడదు. ఎందుకంటే మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సినిమా చూసిన వాళ్లు రివ్యూలు చెప్పకుండా ఎలా ఆపుతారు. కాకపోతే దీనిపై కొంత వరకు యాక్షన్ తీసుకోవచ్చు. సినిమా చూసిన వెంటనే అసలు సినిమా వేస్ట్ అని రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదు.
Read Also : Vijayashanti : వాళ్లు కూడా బతకాలి కదా.. ఆ హీరోయిన్లపై విజయశాంతి కామెంట్
రెండేళ్లు కష్టపడి సినిమా తీస్తే.. రెండు గంటలు చూసి బాలేదు రావొద్దు.. అని చెప్పడం మంచిది కాదు. కాకపోతే సినిమాపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంతే గానీ ఇది రొట్ట సినిమా.. చెత్త సినిమా అంటూ వెంటనే రివ్యూలు రాసేసి మీ ఒపీనియన్ ను జనాలపై రుద్దకండి. ఒకవేళ సినిమా బాలేకపోతే ఒక వారం తర్వాత ఎలాగూ కలెక్షన్లు తగ్గుతాయి. అప్పుడు చెప్పండి ప్లాప్ అని. కానీ వెంటనే ప్లాప్ అని చెప్పేయకండి. మాకు ఇలా అనిపిస్తుంది అని మాత్రం చెప్పండి. నా సినిమాలకు ఇలాంటివి జరగలేదు. కానీ చాలా సినిమాలకు ఫస్ట్ షోకే ఇలాంటి రివ్యూలు చెప్పడం చూస్తున్నాను. ఇది ప్రేక్షకుల మైండ్ ను ఛేంజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.
