హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. గతంలో రెండుసార్లు శివలింగ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోకపోయేసరికి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫామ్ హౌస్ పేకాట కేసులో ప్రధాన నిందితుడుగా గుత్తా సుమన్ పేరు వినిపిస్తున్నా ఈయనతో పాటు మరో వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు అనుమానించిన పోలీసులు వాటికి తగిన ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో హీరో నాగశౌర్య తండ్రే మరో కీలక నిందితుడని, ఈ పేకాట దందాలో శివలింగప్రసాద్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
