యంగ్ హీరో, సీమ కుర్రాడు కిరణ్ అబ్బవరంపై కెరీర్ స్టార్టింగ్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కిరణ్ ఏ సినిమా చేసినా? ఏ ఈవెంట్ లో మాట్లాడినా? వాటిపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ, సినిమాలు ఫ్లాప్ అంటూ ఒక ప్రాపగాండాలా మీమ్స్ చేస్తున్నారు. నిజానికి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏ హీరోకైనా మాములే, ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫేస్ చేసిన ఈ ఫేజ్ నుంచే కిరణ్ అబ్బవరం సక్సస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఫ్లాప్ స్ట్రీక్ లో ఉండగా ఏ హీరోపై రానన్ని కామెంట్స్ కిరణ్ అబ్బవరంపై వస్తున్నాయి ఇందుకు కారణం ఏంటో తనకి కూడా తెలియదని, దయచేసి నన్ను టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యొద్దు అని కిరణ్ అబ్బవరం తన ప్రతి సినిమా ఫంక్షన్ లో చెప్తూనే ఉంటాడు.
ఈసారి కూడా అలాంటి సంఘటనే జరిగింది, కాకపోతే ఇప్పుడు సక్సస్ మీట్ లో… “ఎవరో ఊరు పేరు తెలియని వారంతా కూడా తన సినిమా గురించి ట్విట్టర్‌లో నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎక్కడో నార్త్ ఇండియా వాడు నా సినిమా ఎందుకు చూస్తాడు? సినిమా బాగోలేదని ఎవరో ట్వీట్ చేశారు అని నా టీం చూపిస్తే వాళ్ల అకౌంట్ ఓపెన్ చేసి చూసాను. అది ఫేక్ అకౌంట్, వాడు ఎదో సింగ్ అని పేరు పెట్టుకున్నాడు. నా సినిమాలతో వాడికేం పని, వాడు ఎందుకు చూస్తాడు. ఈసారి ఎవరికీ ఎలాంటి చెడు కనిపించకూడదు అని ప్రతి సీన్ ని మంచిగా రాసుకోని, ఈ వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చేశాము. దీన్ని కూడా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో నాకు పోటీ ఏంటి? ఆయన స్టార్ డమ్ ఏంటి? నా స్థాయి ఏంటి? నేను ఎక్కడ అయినా పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం అని వేసుకున్నానా? నా సమ్మతమే సినిమాను కూడా ఫ్లాప్ అని అన్నారు. ఆ సినిమాకు మూడు కోట్లు పెట్టాం, అన్నీ కలిపి పన్నెండు కోట్లు వచ్చాయి. అంత వచ్చినా కూడా ఫ్లాప్ అని అంటే ఎలా? తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. డెబ్బై వేల ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాను. నన్ను ఎవరు ఎంత కిందకి లాగినా నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికీ వెళ్ళను. వినరో భాగ్యము విష్ణు కథ మంచి సినిమా, మంచి మాటలు చెప్పాము, దేశం గురించి చెప్పాము, పిల్లలకు ఎలాంటి మాటలు చెప్పాలో.. ఎలా పెంచాలో.. చూపించాము.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని అందరూ చూడండి” అని కిరణ్ అబ్బవరం మాట్లాడాడు. ఫ్లాప్స్ సమయంలో తనని టార్గెట్ చేసిన వారికి కిరణ్ అబ్బవరం హిట్ కొట్టి క్లాస్ పీకాడు. మరి ఇక్కడితో ఈ ట్రోలింగ్ ఆగిపోతుందేమో చూడాలి.