NTV Telugu Site icon

Thandel: సాయిపల్లవి ని ప్రశంసలతో ముంచెత్తిన హీరో కార్తీ..

February 7

February 7

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుండటంతో ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్‌ కూడా అదే రెంజ్ లో జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ తమిళ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యంగ్ హీరో కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న హీరో చై, డైరెక్టర్ చందూ అంతా కూడా సాయిపల్లవి డెడికేషన్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. వీరితో పాటు కార్తీ కూడా సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తడు..

Also Read:Chhaava: ‘ఛావా’ సినిమాతో వారి అనుభూతిని పంచుకున్న విక్కీ కౌశల్, రష్మిక..

కార్తీ మాట్లాడుతూ.. ‘ ‘ప్రేమమ్’ సినిమాలోని మలార్ నుండి ‘అమరన్’ లోని ఇందు వరకు .. నువ్వు చేసిన ప్రతి పాత్ర సో స్పెషల్ సాయి పల్లవి. అన్ని పాత్రలకి నువ్వు జీవం పోశావ్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి అంత వేరియేషన్ ఎలా చూపించగలుగుతున్నావో అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా ‘అమరన్’ లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు ఎంత అల్లాడిపోయిందో, ఆమె ఆవేదన,బాధ ఎవ్వరికీ తెలీదు. కానీ నీ సహజమైన నటన వల్ల అది అందరికీ అర్థమైంది. స్క్రీన్ పై అలాంటి పెర్ఫార్మన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు..హ్యాట్సాఫ్’ అంటూ సాయి పల్లవి ని పొగడ్తలతో ముంచేశాడు కార్తీ. దీంతో కార్తీ మాటలు విన్న సాయిపల్లవి కొంత ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.