Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
- జూలై 17న ప్రేక్షకుల ముందుకు వెంకట్రామయ్య గారి తాలూకా
- ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక
- ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జానపద గాయని కోమలి నిర్మాతగా మారి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా విడుదలకు సమయం ఆసన్నమవడంతో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ కూడా వేడుకలో పాల్గొని సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ.. చిన్న గ్రామం నుంచి వచ్చిన కోమలి నిర్మాతగా ఈ స్థాయిలో సినిమా నిర్మించడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే భావోద్వేగ కథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులంతా ఎంతో అంకితభావంతో పనిచేశారని, ముఖ్యంగా నిర్మాత కోమలి ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. జూలై 17న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా తప్పక విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ‘ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమలి ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమా నిర్మించడం అభినందనీయం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించాలి. తెలంగాణలో చిన్న చిత్రాల అభివృద్ధికి మా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. తెలుగు సినిమాల మాదిరిగానే తెలుగు ప్రజలు కూడా ఐక్యంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. భావోద్వేగ కుటుంబ కథాంశంతో రూపొందిన ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ చిత్రం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!