NTV Telugu Site icon

Sir: కొత్త జర్నీ మొదలుపెట్టిన ధనుష్ ‘సార్’…

Sir

Sir

ప్రస్తుత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే వినిపించే టాప్ 5 హీరోల పేర్లలో ‘ధనుష్’ పేరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్టార్ హీరో అవ్వగలరు కానీ ఏ పాత్రలో అయినా నటించే యాక్టర్ మాత్రం అవ్వలేరు. ఈ యాక్టింగ్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న రేర్ హీరోల్లో ఒకడైన ధనుష్ హిందీ, ఇంగ్లీష్, తమిళ బాషల్లో సినిమా చేస్తూ మార్కెట్ ని పెంచుకున్నాడు. తెలుగులో ధనుష్ డబ్బింగ్ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి కనే స్ట్రెయిట్ మూవీ ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఒక్క డైరెక్ట్ తెలుగు మూవీ చెయ్యకుండానే టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ని మైంటైన్ చేస్తున్నాడు ధనుష్. అందుకే ధనుష్ తో తెలుగు, తమిళ బాషల్లో ‘సార్’ అనే సినిమా చేస్తున్నారు సీతారా ఎంటర్టైన్మెంట్స్.

సెన్సిబుల్ సినిమాల దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ డైరెక్ట్ చేస్తున్న ‘సార్’ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. జనవరి 17న ‘బంజారా’ అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాస్టారు’ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, ధనుష్ లది హిట్ కాంబినేషన్ అనే విషయాన్ని ;’సార్’ సినిమా మరోసారి ప్రూవ్ చేయ్యనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి శాకుంతలం, ధమ్కీ, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాల నుంచి తెలుగులో గట్టి పోటీ ఎదురవ్వనుంది. ఈ పోటీ దాటి ధనుష్ తెలుగులో హిట్ కొడితే మాత్రం టాలీవుడ్ లో ధనుష్ కి సూపర్ మార్కెట్ క్రియేట్ అయినట్లే.

Show comments