Site icon NTV Telugu

Chiyan Vikram: ఆరోగ్యంపై విక్రమ్ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

Hero Chiyan Vikram'

Hero Chiyan Vikram'

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విక్రమ్​డిశ్చార్జ్​ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో సందేశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు నటుడు విక్రమ్ స్వయంగా చెప్పారు. తనపై ప్రేమ, అభిమానం చూపించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమకు ఉప్పొంగిపోయానని ఆయన అన్నారు. ఇంతమంది ప్రేమ కనబరచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోపై స్పందిస్తున్న అభిమానులు ఆయన కోలుకోవడం ఆనందంగా ఉందంటూ పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత షూటింగ్స్‌లో పాల్గొనాలని సూచిస్తున్నారు.

విక్రమ్​ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని విక్రమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. వార్లల్లో వచ్చిన సమాచారమంతా ఫేక్ అంటూ విక్రమ్ మేనేజర్ కొట్టిపారేసారు. అనంతరం విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ఆయనకు ఏమి కాలేదని.. ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. అలానే ఇదే విషయాన్ని విక్రమ్ చేరిన చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు కూడా అలాగే స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్​కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. విక్రమ్‌ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. మరోవైపు… విక్రమ్​ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ఆయన ‘కోబ్రా’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కోబ్రా’ ఆడియో లాంచ్ కోసం వేచి చూడాలంటూ అభిమానులను ఉద్దేశించి ఆయన వెల్లడించారు.

https://twitter.com/mathanotnmcvf/status/1545804375289114625

Exit mobile version