Akash Puri: నా తండ్రి డైరెక్షన్ లో నేను నటించను.. పూరి కొడుకు షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Puri: డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు, యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటున్న విషయం తెల్సిందే. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందని ఆకాష్ పూరి చెప్పుకొచ్చాడు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంచ్ కార్యక్రమంలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి పాల్గొన్నాడు.
ఇక ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ..” ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని రమేష్ , రోమన్ నన్ను సంప్రదించారు. నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్ లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. నేను చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ ఇదే కావడం హ్యాపీగా ఉంది. నిన్న ఈ బ్రాండ్ ను లాంఛ్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చాం. ఆ ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా మరికొన్ని బ్రాండింగ్స్ కు కూడా అంబాసిడర్ గా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా చోర్ బజార్ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. నేను ఈసారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ వంటి క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్ లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ వంటి మూవీస్ చూసినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలి అనే కోరిక కలుగుతుంటుంది. నాన్న పూరి డైరెక్షన్ లో రామ్ గారు నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది. ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఓనర్ రమేష్ మాట్లాడుతూ..” ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ను మొదట ఆన్ లైన్ బ్రాండింగ్ గా మొదలుపెట్టాం. ఆన్ లైన్ లో క్లోతింగ్ విషయంలో చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. మనం జెన్యూన్ గా కస్టమర్స్ కు క్లోత్స్ అందించాలని ఆన్ లైన్ లో అమ్మకాలు ప్రారంభించాం. క్యాజువల్స్, ఫార్మల్స్, ఇంపోర్టెడ్, ఫంకీ, మెన్స్ యాక్ససరీస్ ఇలా…మెన్స్ క్లోతింగ్ కు వన్ స్టాప్ లా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఆర్ సీకి వస్తే ఏ ప్రాడక్ట్ అయినా దొరుకుతుంది అనే నమ్మకాన్ని ఇస్తున్నాం. మా బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు ఆకాష్ అయితే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయి మా బ్రాండ్ గురించి చెప్పాం. ఆకాష్ గారు మా బ్రాండ్ కు ప్రచార కర్తగా ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం” అని తెలిపాడు.
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఓనర్ రూమన్ మాట్లాడుతూ..”మా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ను 2022లో స్టార్ట్ చేశాం. రెండేళ్లలోనే ఒక మంచి పొజిషన్ లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ మేము స్థాపించడం వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే. మెన్స్ వేర్ కు వన్ స్టాప్ సొల్యూషన్ లా ఉండాలని అనుకున్నాం. మెన్స్ వేర్ లో మార్కెట్ లో ఉన్న స్పేస్ ను క్యాప్షర్ చేయాలని అనుకుంటున్నాం. మేము విజయవాడలో స్టోర్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి కొనుక్కునేవాళ్లు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టబోతున్నాం. మా బ్రాండ్ కు ప్రచాకర్తగా చేసేందుకు ఒప్పుకున్న ఆకాష్ అన్నకు థ్యాంక్స్” అని అన్నాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?