Site icon NTV Telugu

Akkineni Nagarjuna: కింగ్ నాగ్ నటించిన ఐకానిక్ మూవీస్ ఇవే…

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. యువసామ్రాట్ నాగార్జున నుంచి కింగ్ నాగ్ అనిపించుకునే వరకూ ఎదిగిన నాగార్జున, తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీస్ లో ఈయనకున్న క్రేజ్, అమ్మాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. చూడగానే లాంగ్ హెయిర్ తో, వెల్ బిల్ట్ బాడీతో బాలీవుడ్ హీరోల ఉంటాడు నాగార్జున. ఈ కారణంగానే అప్పట్లో నాగార్జున నుంచి ప్రేమ కథా చిత్రం వచ్చింది అంటే చాలు అమ్మాయిలు థియేటర్స్ కి వెళ్లడానికి ముందుండే వాళ్లు. ఆ తర్వాత అన్నమయ్య లాంటి సినిమాలు చేసి ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చాడు నాగార్జున. ఇక్కడి నుంచి నాగార్జున చూపించిన వేరియేషన్స్, ఆయన ఫ్యాన్ బేస్ ని మరింత పెంచింది. ఆ రేంజ్ ఫాలోయింగ్ నాగార్జున సొంతం చేసుకోవడానికి హెల్ప్ అయిన సినిమాలేంటో చూద్దాం. ఇప్పటివరకూ 98 సినిమాలు చేసాడు నాగార్జున… అందులో ఐకానిక్ గా నిలబడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

విక్రమ్ నుంచి మొదలుపెడితే మజ్ను, ఆఖరి పోరాటం, విక్కీ దాదా, గీతాంజలి, శివ, కిల్లర్(సినిమా యావరేజ్ అయ్యింది కానీ నాగార్జున లుక్స్ కి సూపర్ క్రేజ్ వచ్చింది), ఖుదాగవా, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, క్రిమినల్, ఘరానా బుల్లోడు, సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, సంతోషం, మన్మథుడు, శివమణి, మాస్, కింగ్, రగడ, శ్రీ రామదాస్, మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి లాంటి సినిమాలు నాగార్జున టాప్ హీరోగా నిలబెట్టాయి.కమర్షియల్, ఎక్స్పరిమెంటల్, ఎంటైనర్స్ అనే తేడా లేకుండా కథ నచ్చితే మార్కెట్ గురించి ఆలోచించకుండా డేర్ చేసి నాగార్జున సినిమా చేసే వాడు. అందుకే నాగార్జున ఫిల్మోగ్రఫీలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఏ స్టార్ హీరోకి కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఫిల్మోగ్రఫీ లేదేమో.

Exit mobile version