మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్ లోకి వచ్చింది. ఎప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమా మళ్లీ స్టార్ట్ అవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అప్పటివరకూ ఫుల్ స్వింగ్ లో జరిగిన షూటింగ్ స్లో అవ్వడంతో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కూడా డైలమాలో పడే పరిస్థితి వచ్చింది.
ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంటి వాడు స్టేజ్ పైన మాట్లాడుతూ… శంకర్ చెప్పే వరకూ మనకి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ తెలియదు అన్నాడు అంటే గేమ్ ఛేంజర్ విషయంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా సంక్రాంతికి అనౌన్స్ అయిన గేమ్ ఛేంజర్ ఇప్పుడు సమ్మర్ కి లేదా పోస్ట్ సమ్మర్ కి షిఫ్ట్ అయినట్లు ఉంది. అయితే ఎంత డిలే ఉన్నా… గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం ప్రాపర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని సమాచారం. శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు సాంగ్స్, రెండు ఫైట్స్ ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని రేంజులో ఉంటాయని సమాచారం. శంకర్ సాంగ్స్ లో ఉండే విజువల్స్ ఏ డైరెక్టర్ క్యాప్చర్ చేయలేడు అనేది నిజం. శంకర్ గ్రాండ్ మేకింగ్ కి, చరణ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో చూడాలి.
