Hema Suspended from MAA Says Secretary Raghubabu: మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మా సెక్రటరీ రఘుబాబు ప్రకటించారు. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమా పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆమె దగ్గర తీసుకున్న బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడంతో ఆమెను రెండు సార్లు విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఒకసారి జ్వరం అని మరోసారి మరో రకంగా కారణాలు చెబుతూ ఆమె దాటవేసే ప్రయత్నం చేసింది.
Chiranjeevi – Pawan: చిరు కాళ్ళపై పడ్డ పవన్.. ఏడ్చేసిన నాగబాబు
దీంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆమెను అరెస్టు చేసి తీసుకు వెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇక ఆమెకు బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడంతో మా అసోసియేషన్ సమగ్రత్నము నిలబెట్టేందుకు హేమ మీద చర్యలు తీసుకున్నామని రఘుబాబు పేర్కోన్నారు. అయితే హేమాను అరెస్ట్ చేసి తీసుకు వెళుతున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అప్పుడు తాను పార్టీలో కేక్ కటింగ్ కు మాత్రమే హాజరు అయ్యానని, తరువాత హైదరాబాద్ వచ్చేసి బిర్యానీ వండి వీడియో కూడా పెట్టానని పేర్కొన్నారు.
