NTV Telugu Site icon

Hema : పోలీసులకు తప్పుడు పేరిచ్చిన హేమ.. అందుకే ఇంత రచ్చ?

Nati

Nati

Actress Hema Bangalore Rave Party News:  బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులకు చిక్కిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ కి పంపించారు. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అందులో 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఇక ఈ రేవ్ పార్టీలో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ టెస్టుల్లో నటి హేమకు పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హేమ గురించి మరో సంచలనం విషయం కూడా బయట పడింది. ఈ అంశం మరింత షాక్ కలిగిస్తోంది. అదేమంటే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి తన పేరు బయట పడకుండా జాగ్రత్త పడినట్లు తాజాగా వెల్లడైంది.

Also Read; Manam: మళ్ళీ మెస్మరైజ్ చేస్తోన్న మనం.. వైరల్ అవుతున్న వీడియోలు

పార్టీలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వారి వివరాలు నోట్ చేసుకునే సమయంలో పోలీసులు అడిగినప్పుడు తన పేరు హేమ అని కాకుండా కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే ఆమె వివరాలు నోట్ చేసుకుని కృష్ణవేణి పేరుతోనే కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటం మొదలు ఈ వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. ముందుగా మీడియాలో హేమ ఈ పార్టీకి హాజరైనట్లు వార్తలు రావడం తర్వాత హేమ వీడియో రిలీజ్ చేసి నేను హైదరాబాదులోనే ఉన్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. హేమ రక్త నమూనాలలో డ్రగ్స్ ట్రేసెస్ కనిపించడంతో ఆమెకు ముందు నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపబోతున్నారు పోలీసులు.