Hebah Patel: ఆహాలో అక్టోబర్ 6 న రిలీజ్ కానున్న `ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్`!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో రెడీ అయింది ఆహా. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారమవుతుంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించారు. విప్లవ్ కోనేటి దర్శకనిర్మాతగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ప్రాజెక్ట్ ఇది. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్‌తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. అనూహ్యమైన రీతిలో సాగుతుంది కథ. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటుంది. అసలు వాళ్ల ఉద్దేశం ఏంటి? మళ్లీ పుట్టడమేనా? ఈ కథను ముందుకెళుతున్న కొద్దీ అనూహ్యమైన ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్… ఇలాంటివి ఎన్నెన్నో కళ్లముందు కదలాడుతుంటాయి. కథ విషయానికి వస్తే, మదనపల్లి టౌన్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తెరకెక్కింది.
ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్, అన్నిటి మేళవింపుగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. హెబ్బా పటేల్ ఇటీవల నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్ . ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆహాలో అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో మళ్లీ ఆహా ప్రేక్షకులను పలకరించనున్నారు హెబ్బా పటేల్. రీసెంట్‌గా మళ్లీ పెళ్లితో ఆహా ఆడియన్స్ ని అలరించిన నరేష్ వీకే, పవిత్రా లోకేష్ కూడా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ లో భార్య భర్తలుగా నటించారు. ఆద్యంతం సస్పెన్స్ తో ఇంతవరకూ కనీవినీ ఎరుగని థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది అక్టోబర్ 6 నుంచి ఆహాలో. థ్రిల్లర్ జోనర్‌కి సరికొత్త నిర్వచనం చెప్పే సినిమా అవుతుంది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!