హాట్ బ్యూటీ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ బ్యూటీ కన్నడ చిత్రం ‘అధ్యక్ష’ సినిమాతో సినీ ఇండస్ట్రీ కీ పరిచయం అయింది.ఈ మూవీలో హేబా ‘ఐశర్య’ అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత ఓ తమిళం సినిమాలో కూడా నటించింది..తెలుగు ఇండస్ట్రీకీ ‘అలా ఇలా’ సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర సరసన అద్భుతంగా నటించి మెప్పించింది.ఆ తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన `కుమారి 21ఎఫ్`లో నటించి తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈ భామ బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమా తరువాత తెలుగులో వరుస చిత్రాల్లోనే అవకాశాలు దక్కించుకుంది.హీరో నిఖిల్ సిద్దార్థ్ సరసన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ తరువాత ఈ భామ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ‘ఈడోరకం ఆడో రకం’ అంధగాడు, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలు కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమాలో నటించి మెప్పించింది.కానీ ఆ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి.రామ్ పోతినేని ‘రెడ్’ చిత్రంలో సడెన్ గా ఐటెం సాంగ్ తో అలరించింది. రామ్ తో గ్లామర్ స్టెప్పులేసి ఈ భామ ఎంతగానో అలరించింది.. ఆ తరువాత ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాతో మంచి విజయం అందుకుంది.. అలాగే రీసెంట్ గా ఓటీటీ లో విడుదల అయిన ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సిరీస్ జీ5లొ స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియాలో కూడా హేబా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తోంది. హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.అయితే తాజాగా ట్రెడిషనల్ వేర్ లో కనిపించి మెప్పించింది.. బ్లూ చుడీదార్ లో ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.