Site icon NTV Telugu

Custody: పోలీస్ పవర్ చెప్పి హైప్ పెంచేశారే..

Chy

Chy

Custody: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం.. తమదైన స్టైల్లో హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో తాజాగా చై.. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో సందడి చేసి పోలీసుల జీవితాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను కూడా పోలీసులకు డేడికేట్ చేశాడు. ‘హెడ్ అప్ హై’ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. పోలీస్ గురించి, వాడు పడే కష్టం గురించి రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతమని చెప్పాలి. తాము చేసే పనికి రోజాపూలు ఇచ్చి గుర్తించాల్సిన అవసరం లేదని, వారి నుంచి వచ్చే అభినందనలే చాలని ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చారు.

Natty Kumar: ఆస్కార్ గ్రహీతలకు సన్మానం.. అతను లేకుండా సిగ్గుచేటు

ఇక యువన్ శంకర్ రాజా సంగీతం, యువన్, అర్జున్ కౌడిన్య, అసల్ కోలార్ మెస్మరైజింగ్ వాయిస్ అయితే వినసొంపుగా ఉంది. ఇక జానీ మాస్టర్ హుక్ స్టెప్స్ తో చై అదరగొట్టేశాడు. శివ అనే కానిస్టేబుల్ గా ఈ చిత్రంలో చై కనిపించనున్నాడు. మొదటి సాంగ్ తోనే సినిమాపై హైప్ పెంచేశాడు వెంకట్ ప్రభు. ముందు ముందు మరిన్ని సాంగ్స్ తో అభిమానులను అలరించడమే కాకుండా సినిమాపై హైప్ కూడా పెరుగుతుందని అర్ధమవుతోంది. మరి ఈ సినిమా చై కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version