నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో మెప్పించిన హీరో హవీష్. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “నేను రెడీ”. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “నేను రెడీ” మూవీ టైటిల్, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
Also Read : Kollywood : అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో సూర్య.?
హీరో హవీష్ మాట్లాడుతూ ‘ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. చాలా మంది నుంచి విశెస్ అందుకున్నా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్విలా, జీనియస్, సెవెన్ వంటి మూవీస్ తో నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వారి సపోర్ట్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేయమని నా వెల్ విషర్స్ చెబుతుంటారు. నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్ లో చేయాలనుకుంటా. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటా. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. నేను రెడీ మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను రెడీ బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ, త్రినాథరావు గారి అన్ని మూవీస్ లో కల్లా ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరిందని చెప్పగలను. ఈ చిత్రంలో ప్రతి యాక్టర్ బాగా పర్ ఫార్మ్ చేశారు. మిక్కీ గారి మ్యూజిక్, నిజార్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్రవీణ్ పూడి గారు కూడా నేను అడగగానే వచ్చి వర్క్ చేశారు. మా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
