NTV Telugu Site icon

Akkineni Nagarjuna: అయ్యగారిని తండ్రిగారు లైట్ తీసుకుంటున్నారా..?

Akhil

Akhil

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం తన కన్నా తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చిన్న కొడుకు అఖిల్ విషయంలో నాగ్ ఎప్పుడు అశ్రద్ధ చేయడు. అఖిల్ సినిమా నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో అఖిల్ కు అండగా నిలిచాడు. అయితే ఈసారి మాత్రం నాగ్.. కొడుకును లైట్ తీసుకున్నాడా..? అంటే నిజమే అంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు అని చెప్పుకొస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ అందుకున్న అఖిల్.. ఈసారి ఏజెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అయ్యగారు ఒక్కరే కనిపిస్తున్నారు.

Sai Dharam Tej: రెండేళ్లు అనుభవించిన నరకానికి దక్కిన ఫలితం.. ఈ విజయం

ఇటు పక్క నాగ చైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అయితే కెమెరా కంటికి చిక్కడమే అరుదుగా మారిపోయింది. కనీసం కొడుకుల ట్రైలర్, టీజర్ లను ట్విట్టర్ లో కూడా షేర్ చేయలేదు. సరే చై .. కస్టడీ అంటే బై లింగువల్.. తన కొత్త జర్నీ తనకే వదిలేశాడు అనుకోవచ్చు. అఖిల్ ను కూడా అలాగే వదిలేశాడా..? ఇప్పటివరకు నాగ్ మీడియా ముందు అఖిల్ ఏజెంట్ సినిమా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో అఖిల్ ఏజెంట్ విషయంలో నాగ్ లైట్ తీసుకున్నాడట. సురేందర్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు అంటుండగా.. అంతకుముందు తాను ఇన్వాల్వ్ అవ్వడం వలన ప్లాప్స్ వచ్చాయి కాబట్టి.. ఈసారి దూరంగా ఉంటే బెటర్ అని అనుకోని ఉంటాడని మరికొందరు అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే నాగ్ నోరు విప్పక తప్పదు అంటున్నారు అభిమానులు.

Show comments