NTV Telugu Site icon

Harshavardhan Rane: పెళ్ళైన హీరోయిన్స్ తోనే తెలుగు హీరో ఎఫైర్.. ఇప్పటికీ ముగ్గురు..?

Harsh

Harsh

Harshavardhan Rane: టాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే గురించి అందరికి తెల్సిందే. రాజమండ్రి నుంచి వచ్చి.. చిన్నచిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. తకిటతకిట, అవును, ఫిదా, గీతాంజలి సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు అయిన హర్షవర్ధన్.. బాలీవుడ్ లో సనమ్ తేరి కసమ్ తో మంచి గుర్తింపును అందుకున్నాడు.ఇక ఈ కుర్ర హీరో సినిమాల కంటే.. వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. వివాదాలు అంటే.. కేవలం హీరోయిన్స్ తో ప్రేమ, బ్రేకప్ లతోనే బాగా ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. ముఖ్యంగా పెళ్లి అయ్యి, విడాకులు తీసుకున్న నటీమణులతోనే మనోడు ప్రేమాయణం మొదలుపెడుతూ ఉంటాడు. ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మతో హర్షవర్ధన్ నడిపిన ప్రేమాయణం ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటనే కనిపించేది. ఇక అప్పటికే కిమ్ కు పెళ్లి అయ్యి విడాకులు కూడా తీసుకుంది. ఇక ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకొనేలోపు.. కిమ్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. దీంతో హర్షవర్ధన్ మరో నటి మీనాక్షి దాస్ తో డేటింగ్ మొదలుపెట్టాడు. వీరు కూడా బీచ్ లు, రెస్టారెంట్ లు అంటూ తిరిగారు. కనీసం మీనాక్షితోనైనా సెట్ అవుతాడు అనుకుంటే.. కొన్ని రోజులకు ఆమెకు కూడా బ్రేకప్ చెప్పి సింగిల్ లైఫ్ కు మారాడు.

Sundaram Master Teaser: గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే.. ఎట్టా ఉంటాదో తెలుసునా.. ?

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టీవీ నటితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. గత కొన్నిరోజులుగా.. టీవీ నటి సంజీదా షేక్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజీదాకు ఇప్పటికే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విబేధాల వలన ఆమె విడాకులు తీసుకొని పిల్లలతో కలిసి ఉంటుంది. తాజాగా హర్షవర్ధన్.. ఆ కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్ళాడు. సంజీదా, హర్షవర్ధన్ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈసారైనా ఈ హీరో.. పెళ్లి వార్త చెప్తాడా.. ? లేక ఇది కూడా బ్రేకప్ తో ముగుస్తుందా చూడాలి.

Show comments