Harshith Reddy: అర్జున్ రెడ్డి’కి మా సినిమాకి ఏం సంబంధం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో, నేటివిటీని నమ్ముకుని వచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ‘శుభం’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “దీవాన”. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ ద్వారా స్మేహ మణిమేగలై హీరోయిన్గా, శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ ద్వారా ఈ నెల 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో హీరో హర్షిత్ రెడ్డి మీడియాతో పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఆయన మాటల్లోనే “మా నాన్నది మిర్యాలగూడ అయినప్పటికీ, నేను పుట్టి పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే. అందుకే ఇక్కడి కల్చర్, లోకల్ లైఫ్ స్టైల్ నాకు బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసేవాడిని. ఆ వీడియోలు చూసే నన్ను వైజయంతీ మూవీస్ వారు ‘మెయిల్’ సినిమా కోసం ఆన్లైన్ ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. కోవిడ్ సమయంలో మహబూబాబాద్‌లోని ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ సింగిల్ షెడ్యూల్లో ఆ సినిమా పూర్తి చేశాం. ఆ చిత్రంలో నేను చెప్పిన ‘బీకామ్ కంప్యూటర్స్’ డైలాగ్ నచ్చడంతో.. రాజ్ అండ్ డీకే ప్రొడక్షన్లో ‘శుభం’ సినిమా ఛాన్స్ వచ్చింది. ఇక ‘కల్కి’ సినిమా విషయానికొస్తే.. అసలు ఆడిషన్ లేకుండానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు నన్ను సెలెక్ట్ చేశారు. ‘చూడగానే పాపం అనిపించే మొహం కావాలి.. నువ్వు పర్ఫెక్ట్గా సూట్ అయ్యావు’ అని ఆయన నాతో చెప్పారు. బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడే నాకు వరుసగా ఈ అవకాశాలు రావడం నా అదృష్టం.”
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
‘దీవాన’ సినిమా వెనుక కష్టాన్ని వివరిస్తూ.. “‘శుభం’ సినిమా కంటే ముందే నాకు ‘దీవాన’ కథ వచ్చింది. ‘ఆహా’ లో నేను చేసిన వెబ్ సిరీస్ ల ద్వారా నిర్మాతలు వాసు, శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా కోసం మేము చాలా టైమ్ తీసుకున్నాం. మూడు రోజులు షూటింగ్ చేస్తే, దాదాపు పది రోజులు వర్క్‌షాప్స్ చేసేవాళ్లం. డైరెక్టర్ మమ్మల్ని అంతలా ప్రిపేర్ చేశారు. సినిమా లేట్ అయినా ఎక్కడా రీ-షూట్స్ చేయలేదు. సెట్స్‌లో ఇంప్రొవైజ్ చేస్తూ, అంతా రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. ఈ సినిమా పూర్తయ్యాక అల్లు అరవింద్ గారికి చూపించగా, ఆయనకు విపరీతంగా నచ్చేసింది. గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయడానికి ఆయనే ముందుకొచ్చారు.” అని హర్షిత్ తెలిపారు. “సినిమాలో ‘నా పిల్లరా’ అనే డైలాగ్ విన్నాక చాలామంది అర్జున్ రెడ్డితో పోల్చారు. కానీ హైదరాబాద్ కుర్రాళ్ల బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం సహజంగానే అలా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎక్కడా అర్జున్ రెడ్డి గుర్తుకురాదు. ఓల్డ్ సిటీ నేటివిటీ, ఇక్కడి గ్యాంగ్స్ అగ్రెషన్ వల్లే ఆ పోలిక వచ్చి ఉంటుంది.” అని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?