గత కొద్దికాలంగా హీరోయిన్ల వస్త్రాధారణ అనే అంశం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, వాటి మీద అనసూయ స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా జనాలు విడిపోయి, ఒకరకంగా సోషల్ మీడియా వార్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘అమృతం’లో శివాజీ రాజా తర్వాత అమృతరావు అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్, ఈ మధ్యకాలంలో సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ.. “అమ్మాయిల బట్టలను బట్టి మీరు బిహేవ్ చేయడం కాదు, వాళ్ళ బట్టలు ఎలా ఉన్నా మీరు సవ్యంగా ఉండండి అని అబ్బాయిలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు?” అని ప్రశ్నించగా, దానికి హర్షవర్ధన్ స్పందించారు.
Also Read :Ram Charan : ఎన్టీఆర్ డ్రైవింగ్ అంటే చాలా భయం.. రాం చరణ్ షాకింగ్ కామెంట్స్
“నేను దొంగ మనసు మార్చడం కన్నా ఇంటికి తాళం వేయాలని నమ్ముతాను. ఇంటికి తాళం వేయడం ఈజీ, అది నా చేతుల్లో ఉన్న పని. మా ఇంట్లో ఉన్న చెల్లికో, తల్లికో ‘తలుపులు సరిగ్గా వేసుకో, నేను బయటకు వెళుతున్నాను, తలుపులు తీసి ఉంటే ప్రాబ్లం అవుతుంది’ అని నాకు చెప్పడం ఈజీ. కానీ బయట బోర్డు పెట్టి.. ‘దొంగలారా, నేను లేని టైంలో మా అమ్మ ఒంటరిగా ఉన్నారు, ఆమె జోలికి రావద్దు’ అని చెప్పడం కష్టం. అనసూయ గారు రెండు విషయాలను మిక్స్ చేసి మాట్లాడుతున్నారు, అలా చేయకూడదు. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా లేక బట్టల గురించి మాట్లాడుతున్నారా? స్వేచ్ఛ అనే విషయంలో బట్టలు కూడా ఉన్నాయి కానీ, బట్టలు ఒకటే స్వేచ్ఛ కాదు. మంచి ఉద్దేశం ఉన్నవాళ్లు ప్రజెంటేషన్ లో రాంగ్ అయితే ఒక శివాజీ గారు అవుతారు, ఒక అనసూయ గారు అవుతారు.
Also Read :Mahesh Babu : సెట్లో మహేష్ బాబు చిలిపి పని.. నిర్మాతకు ఒకటే ‘మ్యూజిక్కు’
స్వేచ్ఛ అనే విషయంలో చాలా అంశాలుంటాయి. తినే తిండి మొదలు, చదువు, ఎంచుకునే రిలేషన్, నచ్చే ప్లేస్ కి వెళ్లడం.. ఇవన్నీ ఉంటాయి. ఇందులోనే కావలసిన బట్టలు వేసుకోవడం కూడా ఉంది. స్వేచ్ఛలో బట్టలు ధరించడం కూడా ఒక భాగమే తప్ప, నచ్చిన బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అనేది ఇక్కడ తీసుకురావద్దు, డ్రెస్సింగ్ గురించి మాత్రమే మాట్లాడాలి. అనసూయ గారు మాట్లాడిన తర్వాత ‘నేను వేసుకునే బట్టలు నా పిల్లలకే నచ్చవు’ అనే వీడియో వైరల్ చేశారు. స్వేచ్ఛలో బట్టలు అనేది వస్తుంది కానీ, నచ్చిన బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ కాదు” అంటూ ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
