NTV Telugu Site icon

Harish Shankar : అందుకే పిల్లలు వద్దనుకున్నా.. హరీష్‌ శంకర్ షాకింగ్ కామెంట్స్..

Harish Shankar 3

Harish Shankar 3

Harish Shankar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్‌ శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు హిట్ సినిమాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్. కానీ ఈ నడుమ తీసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా సరే ఆయనకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆయన మూవీ చేస్తున్నాడు. కాకపోతే ఆ మూవీకి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇంత ఇమేజ్ ఉన్న హరీష్‌ తన పర్సనల్ లైఫ్ విషయాలను మాత్రం అస్సలు బయటకు తెలియనివ్వరు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పర్సనల్ లైఫ్ విషయాలను పూర్తిగా బయట పెట్టారు.

Read Also : Yashwanth Varma: మిస్టరీగా 3 ఫోన్ కాల్స్.. ఛేదిస్తున్న ఢిల్లీ పోలీసులు

‘నేను నా భార్య స్నిగ్ధ పిల్లల్ని వద్దనుకున్నాం. ఎందుకంటే మాది పూర్తిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా చెల్లెలికి పెళ్లి చేయాలి, తమ్ముడిని సెటిల్ చేయాలి. ఇలాంటి బాధ్యతలు చాలా ఉండేవి. వీటన్నింటినీ పూర్తి చేయడంతో నా భార్య చాలా సపోర్టు చేసింది. వాటితోనే నేను అలసిపోయా. నాకు ఇలాంటి బాధ్యతలు మళ్లీ వద్దు అనిపించింది. పిల్లలు ఉంటే పూర్తిగా స్వార్థంగా తయారవుతాం అనేది నా ఆలోచన. పైగా అన్నింటికీ అడ్జస్ట్ అయి బతకాలి. అందుకే పిల్లల్ని వద్దని అనుకున్నాం. నేను నా భార్య కూర్చుని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ హరీశ్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.