NTV Telugu Site icon

Harish Shankar: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్‌పై రానా జోకులు.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Harish Shankar

Harish Shankar

ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ అనే కొత్త హీరోయిన్ ని హరీష్ శంకర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో డిజాస్టర్ గా నిలిచింది. టాక్ విషయంలో డివైడ్ టాక్ వచ్చినా సరే ఎందుకో హరీష్ శంకర్ మీద ఉన్న నెగెటివిటీనో మరేమిటో తెలియదు కానీ సినిమాకి మాత్రం డిజాస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా మీద దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా జోకులు వేశారు. రానాతో పాటు ఈ కార్యక్రమానికి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు ఇద్దరు సరదా సరదాగానే మాట్లాడుతూ చాలా సినిమాల మీద కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి కూడా రానా మాట్లాడారు.

Suriya Siva Kumar: సూర్యకు థియేటర్ల తలనొప్పి.. ఇదేం లాజిక్ !

బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై చూశారు లోయస్ట్ లో చూశారు అని రానా అంటే హైయెస్ట్ అయితే కల్కి మరి లోయస్ట్ లో ఏమిటి అని అడిగితే అదే ఈ మధ్య వచ్చింది కదా మిస్టర్ అంటూ ఉండగా తేజా సజ్జ ఏ అలా మాట్లాడొద్దు అంటూ ఆపుతూ ఉండడం కనిపిస్తోంది. అయితే ఇక్కడ వారు సినిమా పేరు ప్రస్తావించకపోయినా అది మిస్టర్ బచ్చన్ గురించేననే చర్చ జరుగుతోంది. దీంతో రవితేజ అభిమాని ఒకరు ఈ వీడియో క్లిప్ కట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నీ మీద జోకులు వేస్తున్నారు అన్న రవితేజ అన్న అంటూ ఆయనను ట్యాగ్ చేశారు. నీకు ఏమీ అనిపించదా అన్న? నవ్వే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి. దిమ్మ తిరిగే హిట్టు కొడితే అందరూ సెట్ అయిపోతారు అది ఎప్పుడన్నా అంటూ ట్వీట్ చేశాడు. దానికి మరో అభిమాని హరీష్ శంకర్ ని టైప్ చేసి అన్న మీరు రవితేజ గారితో ఒక సినిమా చేయాలి మళ్లీ మేము కాలర్ ఎగరేయాలి దీనికి మీ రిప్లై కావాలన్నా అంటూ పేర్కొన్నారు. దానికి హరీష్ శంకర్ ‘ఎన్నో … విన్నాను తమ్ముడు …,అందులో ఇదోటి …., అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ….ఎవరికైనా …అంటూ రాసుకొచ్చారు.

Show comments