NTV Telugu Site icon

Lambasingi Trailer: కొత్త ఐఫోన్ లా దివి.. ఆసక్తికరంగా హరీష్ శంకర్ కామెంట్స్

Lambasingi Trailer

Lambasingi Trailer

Harish Shankar Launched Lambasingi Trailer: ఆంధ్రాలోనూ సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్ ఒకటి ఉంది, అధఃహే ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యిన ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ పేరుతోనే నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నటుడు భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది టాగ్ లైన్. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.

Airtel Recharge: ఎయిర్‌టెల్‌ యూజర్‌లకు షాక్.. పెరిగిన రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ ధరలు!

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ… కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమా అనిపించిందని అన్నారు. సినిమా ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుందన్న ఆయన దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారని అన్నారు. దివికి అలాగే భరత్ రాజ్ కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నా, మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఆనంద్.టి నిర్మాత. సంగీతం ఆర్ఆర్.ధ్రువన్
అందిస్తున్న ఈ సినిమాకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందిస్తున్నాడు.