NTV Telugu Site icon

Harish Shankar: రవితేజ ‘షాక్’..నేను కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది!

Harish Shankar

Harish Shankar

Harish Shankar Intresting Comments on Raviteja Shock Movie: మా ఊరి పొలిమేర -2 ట్రైలర్ ను ఈరోజు హైదరాబాద్ లోని AAA థియేటర్లో గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. నవంబర్ 3న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హరీష్ శంకర్, హీరో కార్తికేయ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేసి రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో మార్కెటింగ్ టీమ్ నోటి వెంట మొట్టమొదటిసారి ఈ పొలిమేర పేరు విన్నానని అన్నారు. సత్యం రాజేష్ చెప్పినా వినలేదు కానీ తరువాత సినిమా చూసి ఇది ఒక్కరే ఇంట్లోనో ఇంకెక్కడో చూసే సినిమా కాదు ఖచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా అని అన్నారు.

Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాలపై సిట్.. రిపోర్ట్‌ రెడీ అవుతుంది..

అది ఈ రెండో పార్ట్ తో నెరవేరుతుంది అని అన్నారు. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ మీరు షాక్ సినిమా చూసి ఒక రోజంతా ఒక జోన్ లో ఉన్నానని అన్నారు కదా ఆ సినిమా చేశాక నేను మూడేళ్లు మరో జోన్ లో ఉన్నానని అన్నారు. మీకు ఒక్కరోజులో మామూలు అయ్యారు కానీ నాకు మూడేళ్లు పట్టింది తేరుకోవడానికి అని అంటూ చెప్పుకొచ్చారు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక సంవత్సరంలో వాసు మొదటి సినిమా తమిళంలో మహా అనే సినిమా కొన్నాడు, ఆ సినిమా ఫంక్షన్ కి నన్ను పిలిచాడు అప్పటి నుంచి వాసు తనకు అండగా ఉంటూనే ఉన్నాడని అన్నారు.

Show comments