NTV Telugu Site icon

Harish Shankar: ఆ ఘటన కలచివేస్తోంది, యాక్షన్ లోకి దిగండి.. ఏపీ పోలీసులకు హరీష్ శంకర్ విజ్ఞప్తి

Harish Shankar Responds On

Harish Shankar Responds On

Harish Shankar Demands Justice for uppala amarnath death: ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఉప్పల వారి పాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ ను కొందరు దుండగులు సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులు వైసీపీకి చెందిన వారు కావడంతో పోలీసులు వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే పోలీసులు మాత్రం అదేమీ లేదని నిందితులు ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తాజాగా ఆ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పరామర్శించారు. అయితే గతంలో దిశా ఎన్కౌంటర్ జరిగినప్పుడు కేసీఆర్ మీద ప్రశంసలు కురిపించిన సినిమా వాళ్ళు ఎవరూ ఈ విషయం మీద స్పందించలేదు అంటూ ఒక వెబ్ పోర్టల్ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేయగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయం మీద స్పందించారు.
New Party in AP: ఏపీలో కొత్త పార్టీ.. లిరిసిస్ట్ జొన్నవిత్తుల కీలక ప్రకటన
సీరియస్‌గా కొన్ని కారణాల వల్ల ఈ వార్త స్కిప్ అయిందో ఏమో నాకు చేరలేదని చెప్పుకొచ్చారు. ఇక తాను ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, శిక్ష కూడా అదే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని, స్థాయి – హోదాతో సంబంధం లేకుండా దోషులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఏపీ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతాను టాగ్ చేస్తూ “ఉప్పల అమర్‌నాథ్” దారుణ హత్య గురించి తెలుసుకుని షాక్ అయ్యాను… సత్వర న్యాయం కోసం “దిశ” చట్టాన్ని ప్రకటించినప్పుడు నేను మెచ్చుకున్నవాడిని.. ఈ విషయంలో కూడా అదే వేగం ఉంటుందని భావిస్తున్నాం.. దయచేసి చర్యలు తీసుకోండి సార్, ఇది కీలక సమయం అంటూ ఆయన కోరారు.