Site icon NTV Telugu

HHVM Trailer : హరిహర.. వీరమల్లు విధ్వంసం మాములుగా లేదు

Harihara

Harihara

ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. సరిగ్గా మూడు వారాల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పట్టేలా.. విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగా.. అద్భుతమైన విజువల్స్‌తో అదిరిపోయింది హరిహర వీరమల్లు ట్రైలర్. మూడే మూడు డైలాగ్స్‌తో సినిమా కథను చెప్పేశారు మేకర్స్.

హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.. అంటూ మొఘలులను ఎదురించిన వీరుని కథే హరిహర వీరమల్లు కథ అని చెప్పేశారు. కోహినూర్ డైమండ్ అంటూ పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ అనే చెప్పాలి. పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ.. పవన్ చెప్పిన డైలాగ్ విజిల్స్ వేసేలా ఉంది. అలాగే.. మన దేశ ప్రధాని మోదీ పవన్ గురించి చెప్పిన ‘యే పవన్ నహీ ఆంధీ హై’ డైలాగ్‌ను ట్రైలర్‌లో హైలెట్ చేశారు. విలన్ బాబీ డియోల్ చేత.. ఆంధీ వచ్చేసింది అంటూ ఎలివేషన్ ఇచ్చారు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్‌ను పవర్ ఫుల్‌గా చూపించారు. ఇక పవన్ లుక్, యాక్షన్, విజువల్ పరంగా ట్రైలర్ అదరహో అనేలా ఉంది. కాకపోతే.. కొన్ని ఫ్రేమ్స్‌లో సీజీ వర్క్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కానీ పీరియాడికల్ సెటప్‌ మాత్రం అదిరిపోయింది. నిర్మాత ఏఎం.రత్నం పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. హీరోయిన్ నిధి అగర్వాల్‌కు మంచి పాత్ర పడినట్టుగా ఉంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తంగా.. పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా ఉంది ఈ ట్రైలర్. ఇక్కడితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. వీరమల్లు విధ్వంసం ఎలా ఉంటుందో చూడ్డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మరి హరిహర వీరమల్లు ఎలా ఉంటుందో తెలియాలంటే.. జులై 24 వరకు వెయిట్ చేయాల్సిందే

Also Read : Nithiin : ‘తమ్ముడు’కి దూరంగా నితిన్.. కారణం ఇదే.!

Exit mobile version