HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎలాంటి డీటేయిల్స్ చెప్పలేదని ఫ్యాన్స్ అంసతృప్తిలో ఉన్నారు. అందుకే గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మే 21న ఉదయం 11 గంటలకు ఈ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పింది మూవీ టీమ్. ఈ ప్రెస్ మీట్ కు పవన్ కల్యాణ్ వస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాలి.
Read Also : Shashi Tharoor: కాంగ్రెస్ 4 పేర్లు సూచించింది..అయినా శశిథరూర్‌కే మోడీ ఓటు..
ఈ ప్రెస్ మీట్ లో చాలా విషయాలపై స్పందించే అవకాశాలు ఉన్నాయి. మూవీ ఆలస్యంతో పాటు రిలీజ్ డేట్, ఇతర విషయాల గురించి కూడా వివరించబోతున్నారు. మూవీ ప్రమోషన్లు ఇంక నుంచి జోరుగా సాగుతాయని అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా మరికొన్ని గంటల్లో చెప్పే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ తో పాటు మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కాబట్టి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో పవన్ కల్యాన్ పీరియాడికల్ పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉంటున్నారు. త్వరలోనే మంత్రి వర్గ సమావేశం కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటారని చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో హైప్ బాగానే ఉంది. ఈ మూవీతో పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Read Also : Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..
