Site icon NTV Telugu

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

Harihara Veeramallu

Harihara Veeramallu

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది.

ఇప్పటికే దాదాపు 13 సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి రిలీజ్ కాబోతుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమాను జులై 24 న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. వస్తావానికి ఈ సినిమా మార్చి నెలలో విడుదల కావాల్సి వుంది. కానీ షూటింగ్ డిలే కారణంతో పాటు థియేట్రికల్ బిజినెస్ వ్యవహారం తెగకపోవడంతో రిలీజ్ కు కాలేదు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను డిసైడ్ చేస్తోంది. జులై మొదటి వారంలో హరిహరను థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. అక్కడ కుదరకుంటే ఆగస్టు ఫస్ట్ వీక్ అనుకోగా అందుకు అమెజాన్ ప్రైమ్ ససేమిరా అనడంతో జులై 24న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది హరిహర. ఇప్పటికే అనేక సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో డిజిటల్ రైట్స్ ధర తగ్గిస్తూ వస్తుంది అమెజాన్. ఇక చేసేదేమి లేక రిలీజ్ కు చేసేందుకు రెడీ అయ్యారు ఏ ఎం రత్నం.

Exit mobile version