AM Ratnam : వీరమల్లు టీమ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూవీ నిర్మాత ఏఎం రత్నం సడెన్ గా కళ్లు తిరిగి పడిపోయారు. రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక ఆయన ఇలా పడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్ పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఏళ్లకు ఏళ్లు మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. మ్యూజిక్ వర్క్ కీరవాణి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ పనులు చూసుకునేందుకు ఏఎం రత్నం శుక్రవారం ఉదయం 5 గంటలకు ఆఫీసుకు వచ్చారు.
Read Also : Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం..
ఏమైందో తెలియదు అనుకోకుండా ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయన్ను పక్కనే ఉన్న ఒమేగా ఆస్పత్రిలో జాయిన్ చేయగా.. హై బీపీతో ఇలా పడిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైబీపీతో పాటు హై ఫీవర్ తో బాధపడుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. మూవీ రిలీజ్ టెన్షన్ వల్లే ఇలా జరిగినట్టు చెబుతున్నారు. మూవీ ఐదేళ్లుగా చిత్రీకరణ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టేశారు. వాయిదాల మీద వాయిదాలు పడింది. ఇప్పుడు రిలీజ్ అవుతుండటంతో.. ఆ టెన్షన్ తట్టుకోలేక ఇలా జరిగిందేమో అంటున్నారు.
Read Also : Sandeep Reddy : సందీప్ రెడ్డికి రామ్ చరణ్ దంపతుల స్పెషల్ సర్ ప్రైజ్..
