Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.?

Harihara

Harihara

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Also Read : Coolie : అందాలు ఆవిడవి.. ఆదరణ ఆయనకు

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఓపెన్ గ్రౌండ్స్ లో ఈవెంట్స్ నిర్వహించేందుకు అనుమతి లేదు. అందుకే ఆంధ్రలో ఈవెంట్ చేయాలనీ మొద విజయవాడలో నిర్వహించాలని భావించారు. కానీ అక్కడ కుదరడం లేదని సమాచారం. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైజాగ్ లో నిర్వహించాహాలని ఆలోచనలు చేస్తున్నారట. అలా కుదరని పక్షంలో హైదరాబాద్ లో ఇండోర్ వేదికగా నిర్వహించాలని ఆలోచనలు ఉన్నాయి. ఆల్మోస్ట్ వైజాగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని యూనిట్ టాక్. ఏదైనా పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఎక్కడనేది తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version